KINGDOM: ‘సక్సెస్-ఫెయిల్యూర్స్’పై ప్రశ్న.. విజయ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్.. కింగ్‌డమ్ సక్సెస్ క్రెడిట్ వారికే

KINGDOM: ‘సక్సెస్-ఫెయిల్యూర్స్’పై ప్రశ్న.. విజయ్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్.. కింగ్‌డమ్ సక్సెస్ క్రెడిట్ వారికే

ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస ఫెయిల్యూర్స్తో సతమవుతున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో చాలా లోతున పడ్డారు. ఈ క్రమంలో భారీ అంచనాలతో విజయ్ నెక్స్ట్ ఫిల్మ్ కింగ్‌డమ్ రేపు (జులై31) రిలీజ్ కాబోతుంది. 

ఈ సందర్భంగా నేడు నిర్వహించిన ప్రెస్ మీట్లో విజయ్కి.. 'సక్సెస్-ఫెయిల్యూర్స్' పై ప్రశ్న ఎదురైంది. సినిమా విడుదలకు ముందే మీరు హిట్ కొట్టారనే విషయం అర్ధమవుతోందనే ప్రశ్నకు విజయ్ ఇంట్రెస్టింగ్గా బదులిచ్చారు.‘కింగ్‌డమ్ కథను రాసి డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి వల్లే ఇది సాధ్యమైంది. అలాగే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సినిమాటోగ్రఫర్స్ గిరీష్ గంగాధరన్, జోమోన్ T.జాన్, ఎడిటర్ నవీన్ నూలి.. వల్లనే సక్సెస్పై నమ్మకం ఉంది. ఒక నటుడిగా ఎప్పుడు ప్రాణంపెట్టి నటిస్తాను. కానీ, మిగతా డిపార్ట్మెంట్స్ కలిసొచ్చినప్పుడు.. ఇలాంటి సక్సెస్ కనిపిస్తుంటుంది. ఇది కింగ్‌డమ్ టీమ్ ఎఫర్ట్’ అని విజయ్ చెప్పుకొచ్చారు. 

అలాగే, గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలా పద్ధతిగా, సైలెంట్గా మాట్లాడుతున్నారు. ఇందుకు ముఖ్య కారణమేంటని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. విజయ్‌ స్పందిస్తూ.. ‘నేనెప్పుడూ నాకు ఏది అనిపిస్తే అదే మాట్లాడతా. ఈరోజు ఇలా మాట్లాడాలని అనిపిస్తోంది. ‘ఎవరూ నన్ను తక్కువ చేసి మాట్లాడకూడదు. నన్ను నేను ప్రొటెక్ట్‌ చేసుకోవాలి. నేను అనుకున్నది సాధించాలి’ అన్న ఆలోచనలతో కెరీర్‌ స్టార్టింగ్లో దూకుడుగా ఉన్నానేమో. సినిమాల్లోనూ చూస్తుంటాం కదా.. హీరో ముందుగా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. అమ్మ, అమ్మాయి ఎవరో ఒకరి వల్ల తర్వాత సాఫ్ట్‌ అయిపోతాడు’అని విజయ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.