KINGDOM: ‘కింగ్‌డమ్’ విడుదల వేళ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ని కలిసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫొటో వైరల్

KINGDOM: ‘కింగ్‌డమ్’ విడుదల వేళ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ని కలిసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫొటో వైరల్

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌’.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌‌‌‌‌‌‌‌లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్​, శ్రీలీల కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో ఓ పాటను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశానికి వస్తూ ‘కింగ్‌డమ్’ మూవీ టీమ్‌‌‌‌‌‌‌‌ పవన్‌‌‌‌‌‌‌‌ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌ను కలిశారు. హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సేతో పాటు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.. పవన్‌‌‌‌‌‌‌‌ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌ను కలిసి ముచ్చటించారు. శ్రీలీల కూడా కింగ్‌డమ్ బృందంతో జాయిన్ అయింది.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు (జులై31న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌ ‘కింగ్‌డమ్’ టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్‌‌‌‌‌‌‌‌ విషెస్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఈ క్రమంలో కింగ్‌డమ్ నిర్మాణ సంస్థ సితార సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పవన్తో గడిపిన క్షణాలను పంచుకుంటూ ఫోటో షేర్ చేసింది.

‘ఇదంతా ఒక సర్కిల్ లా కంప్లీట్ అవుతుంది. ఈ కలయిక కింగ్‌డమ్ చిత్ర బృందానికి ఒక పవర్ ప్యాక్డ్ మూమెంట్. స్వయంగా పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో ఆయన్ని కలిసి మా టీమ్ శుభాకాంక్షలు అందుకుంది’ అని సితార పోస్టు చేసింది. ఈ పోస్ట్కి విజయ్ దేవరకొండ స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

“పవన్ కల్యాణ్ సర్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆయన మొదట చెప్పిన మాట నేను ఒంటరిగా, నిశ్శబ్దంగా ఉండటానికి ఇష్టపడతాను అని. కానీ మేం చాలా సేపు మాట్లాడుకున్నాం. మా కింగ్‌డమ్ బృందం ఆయన ఆశీస్సులు తీసుకున్నాము. ఆయన ఆరోగ్యం, సంతోషం కోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తానని” పోస్టులో విజయ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సొషల్ మీడియాలో వైరల్ అవుతుంది.