
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. విజయ్‌కి జంటగా శ్రీలీల నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఎస్.నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
విజయ్ కెరీర్‌లో ఇది 12వ చిత్రం. బుధవారం రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు. నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) తన చేతుల మీదుగా స్క్రిప్ట్‌ని టీమ్‌కు అందజేశారు. ముహూర్తపు షాట్‌కి ప్రగతి ప్రింటర్స్ ఎండీ పరుచూరి మహేంద్ర కెమెరా స్విచాన్ చేయగా, హానరరీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ సౌత్ కొరియా చుక్కపల్లి సురేష్ క్లాప్ కొట్టారు.
గతంలో సితార సంస్థలో గౌతమ్ తీసిన ‘జెర్సీ’ కమర్షియల్ సక్సెస్‌తో పాటు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఆ చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకూ మ్యూజిక్ ఇస్తున్నాడు. జూన్ నుండి షూటింగ్ మొదలవబోతోంది.