KINGDOM Box Office: కుమ్మేసిన ‘కింగ్‌డమ్‌’ ఫస్ట్ డే కలెక్షన్స్.. కానీ, లైగర్ కంటే తక్కువే!

KINGDOM Box Office: కుమ్మేసిన ‘కింగ్‌డమ్‌’ ఫస్ట్ డే కలెక్షన్స్.. కానీ, లైగర్ కంటే తక్కువే!

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్‌డమ్‌’. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమా నిన్న (జూలై 31) థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ఫస్ట్ డే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.15.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతనేది మాత్రం మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

అయితే, ఇప్పటివరకు విజయ్ దేవరకొండ కెరీర్‌లో రూ.15.95 నెట్ కలెక్షన్స్‌తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా లైగర్ ముందంజలో ఉంది. ఈ రెండు సినిమాల ఓపెనింగ్స్ మధ్య అతిస్వల్ప వ్యత్యాసం మాత్రమే ఉంది. అంతేకాకుండా.. కింగ్‌డమ్‌ సినిమాకు అన్నీ వర్గాల నుంచి 80% పైగా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో కింగ్‌డమ్‌ అంచనాలు మించి వీకెండ్ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సాక్నిల్క్ నివేదిక ప్రకారం:

కింగ్‌డమ్‌ తొలి రోజున రూ.15.50 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రూ.15.5కోట్లు సాధించింది. తమిళంలో రూ.25 లక్షలు దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇంకా ఓవర్సీస్‌లో అంతకుమించి మంచి వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ చెబుతున్నారు.

ఆక్యుపెన్సీ చూసుకుంటే.. తెలుగు మార్కెట్లోనే హయ్యెస్ట్ థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. మార్నింగ్ షోలలో 63.56% ఆక్యుపెన్సీని నమోదు చేయగా.. మధ్యాహ్నం మరియు సాయంత్రం షోలలో వరుసగా 56.52% మరియు 50.12% ఆక్యుపెన్సీలో తగ్గుదల నమోదు చేసింది. రాత్రి షోలలో మొత్తం ఆక్యుపెన్సీ 61.27%గా నమోదై మళ్ళీ ఊపందుకుంది.

ఇదిలా ఉంటే.. కింగ్‌డమ్ అమెరికాలో రికార్డు సృష్టించింది. ప్రీమియర్ డే కలెక్షన్ పరంగా కింగ్‌డమ్ అమెరికాలో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. $900,000 (₹8.50+ కోట్లకి) పైగా కలెక్షన్ సాధించింది. ఇది అద్భుతమైన ప్రారంభం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

ఉత్తర అమెరికాలో ఈ చిత్రాన్ని శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేసింది. ఈ మార్కెట్‌లో కింగ్‌డమ్ అతిపెద్ద ప్రీమియర్ గ్రాసర్ అని సోషల్ మీడియాలో ప్రకటించింది. అక్కడ 650,000 డాలర్లు (రూ.5.42 కోట్లు) గ్రాస్ వసూలు చేసినట్లు తెలిపింది. డే1వసూళ్ళలో సైతం కింగ్‌డమ్ సత్తా చాటింది. ఉత్తర అమెరికాలో రూ.9 కోట్లకి పైగా గ్రాస్ దక్కించుకుంది. ఈ వీకెండ్ మరింత పెరుగుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.