లైగర్ లేటెస్ట్ అప్ డేట్.. కోకా 2.0 సాంగ్ వచ్చేస్తోంది

లైగర్ లేటెస్ట్ అప్ డేట్.. కోకా 2.0 సాంగ్ వచ్చేస్తోంది

రౌడీ హీరో ‘విజయ్ దేవరకొండ’ న్యూ ఫిల్మ్ ‘లైగర్’ సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కింది. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా అయిపోయింది. ఈ సినిమా నుంచి అప్ డేట్స్ ను చిత్ర యూనిట్ అందిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదలై.. లైగర్ పై ఉన్న హైప్ ను  మరింత పెంచింది. మరోవైపు ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్ కూడా యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. మూడో సాంగ్ ను విడుదల చేయనునన్నట్లు హీరో విజయ్ దేవరకొండ ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఆగస్టు 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు ‘కోకా 2.0’ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను పోస్టు చేశారు. ఈ సాంగ్ ఎలా ఉంటుందనే ఉత్కంఠలో విజయ్ దేవరకొండ అభిమానులున్నారు. 

విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. దీంతో ఎప్పుడెప్పుడు ‘లైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ సినిమా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఆగస్ట్ 25న విడుదల కానుంది. విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా అనన్య పాండే నటిస్తోంది. మైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి నిర్మిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి నటిస్తున్న విజయ్... పూరి జగన్నాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ‘జనగణమన’ చిత్రంలోనూ నటిస్తున్నాడు.