
యంగ్ అండ్ డైనమిక్ టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నారు. ఈసారి సరికొత్తగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో సినీ అభిమానుల ముందుకు రాబోతున్నారు. చాలా రోజులుగా చర్చలో ఉన్న ఈ చిత్రానికి ‘రౌడీ జనార్ధన’ అనే పవర్‌ఫుల్ టైటిల్ దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఈ రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ షెడ్యూల్, కాస్టింగ్ వివరాలపై లేటెస్ట్ అప్ డేట్ సినీ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
ముంబైలో షూటింగ్
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ కొత్త చిత్రం ‘రౌడీ జనార్ధన’ పూజా కార్యక్రమం అక్టోబర్ 11, 2025న ఘనంగా జరగనుంది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే, అంటే అక్టోబర్ 16 నుంచి చిత్ర బృందం ముంబైలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది రవికిరణ్ కోల, ఆయన గతంలో ‘రాజా వారు రాణి గారు’ అనే క్లాసిక్ లవ్ స్టోరీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఒక సున్నితమైన ప్రేమకథ తీసిన దర్శకుడు, ఇప్పుడు విజయ్‌తో భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటం ఆసక్తికరంగా మారింది. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం, ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత విజయ్-దిల్ రాజు కాంబినేషన్‌లో వస్తున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
ALSO READ : బిగ్ బాస్ హౌస్‌లో ముదిరిన లవ్ ట్రాక్స్..
రాజశేఖర్ ఎంట్రీ?
‘SVC59’ వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ ప్రాజెక్ట్ ఒక మాస్, గ్రామీణ నేపథ్యం గల యాక్షన్ చిత్రం అని తెలుస్తోంది. విజయ్ దేవరకొండకు పర్ఫెక్ట్ మాస్ ఇమేజ్ ఇచ్చేలా ఈ కథనం ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, ఇందులో కీలకమైన, పవర్‌ఫుల్ పాత్ర కోసం సీనియర్ నటుడు రాజశేఖర్‌ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ రాజశేఖర్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే, విజయ్-రాజశేఖర్ కాంబినేషన్ ఈ సినిమాకి మరింత హైప్‌ను తెస్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
వ్యక్తిగత జీవితంలో బిజీ...
సినిమా షూటింగ్ మొదలు కానున్న నేపథ్యంలోనే, విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. తన ప్రియురాలు రష్మిక మందనతో ఆయనకు నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 2026లో పెళ్లి జరిగే అవకాశం ఉందని ఆయన టీమ్ ధృవీకరించినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై విజయ్, రష్మిక ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. మరోవైపు ఈ హై ప్రొఫైల్ వెడ్డింగ్‌పై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా, అక్టోబర్ 6, 2025న జోగులాంబ గద్వాల జిల్లా, ఉండవల్లి వద్ద విజయ్ కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. తన కారు ఒక బొలెరో వాహనాన్ని ఢీకొట్టినప్పటికీ, విజయ్ దేవరకొండ మాత్రం క్షేమంగా ఉన్నాడు. ఈ యాక్సిడెంట్‌పై ఫన్నీగా స్పందించారు.. కారుకే దెబ్బ తగిలింది, కానీ మేము క్షేమంగా ఉన్నాము. బిర్యానీ , నిద్రతో నా తలనొప్పి తగ్గిపోతుంద" అని సరదాగా చెప్పి అభిమానులకు భరోసా ఇచ్చారు.
విజయ్ దేవరకొండ చివరి చిత్రం ‘కింగ్‌డమ్’ అంచనాలను అందుకోలేకపోయిన నేపథ్యంలో, ‘రౌడీ జనార్ధన’ రూపంలో ఆయన మాస్ హిట్‌ను అందిస్తాడని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ యాక్షన్ డ్రామాపై మరిన్ని అధికారిక ప్రకటనల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
His Rage is Romance, Love is Violence 🔥
— Ravi Kiran Kola (@storytellerkola) May 9, 2025
Wishing our @TheDeverakonda a very Happy Birthday ! #SVC59 #HBDVijayDeverakonda @storytellerkola #Raju #Sirish @SVC_official pic.twitter.com/3DVNe9o2y1