ఎట్టకేలకు విజయ్కు లైన్ క్లియర్.. టీవీకేకు సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల సపోర్ట్ !

ఎట్టకేలకు విజయ్కు లైన్ క్లియర్.. టీవీకేకు సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల సపోర్ట్ !

చెన్నె: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సస్పెన్స్కు తెరపడింది. టీవీకే పార్టీకి మద్దతు తెలపాలని సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో.. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. విజయ్ టీవీకే పార్టీకి కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ అధికారికంగా లేఖ కూడా విడుదల చేసింది.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురి ఎమ్మెల్యేల మద్దతు టీవీకేకు ఉంది. ఇప్పుడు లెఫ్ట్ పార్టీలతో పాటు వీసీకే కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో.. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను విజయ్ పార్టీ చేరుకుంది.

టీవీకే 107, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2.. మొత్తంగా 118 ఎమ్మెల్యేల బలంతో టీవీకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి లైన్ క్లియర్ అయింది. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కలవాలని టీవీకే అధినేత విజయ్ నిర్ణయించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక.. తమిళనాడు గవర్నర్ అర్లేకర్ను విజయ్ కలవడం ఇది మూడోసారి కావడం గమనార్హం.