
విజయ్ సేతుపతి హీరోగా ‘స్కెచ్’ ఫేమ్ విజయ్ చందర్ తెరకెక్కించిన చిత్రం ‘సంగ తమిళన్’. రాశీఖన్నా కథానాయిక. నాజర్, నివేద పేతురాజ్, అశుతోష్ రాణా, సూరి ఇతర ముఖ్య పాత్రలు పోషిం చారు. విజయా ప్రొడక్షన్స్ తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని రావూరి వి శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 15న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు విజయ్ చందర్ మాట్లాడుతూ ‘ట్రైలర్ విజువల్స్ తెలుగు సినిమాలా ఉండటానికి కారణం… ఇది తెలుగు ప్రేక్షకుల కోసం రాసుకున్న కథ కావడమే. పవన్ కళ్యాణ్ గారితో ఎ.ఎమ్.రత్నం గారు ఓ సినిమా చేయాలనుకున్నప్పుడు ఈ కథ చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఆయన రాజకీయాల్లో బిజీ అవడంతో వీలు కాలేదు. అదే కథ విజయా ప్రొడక్షన్స్ కి నచ్చడంతో ఈ సినిమా తెరకెక్కిం ది. విజయ్ సేతుపతి గారికి తమిళంలో ఉన్న మాస్ ఇమేజ్ దృష్ట్యా ఈ కథ ఆయనకి కుదిరింది. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉన్న స్టోరీ. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి టాలీవుడ్ స్టార్స్‌కి తగ్గ స్క్రిప్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ సినిమాతో తెలుగులోనూ అవకాశాలొస్తాయని భావిస్తున్నాను’ అన్నారు.
‘హీరో పేరులో, సినిమా టైటిల్లో, విజయ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఉన్న విజయం.. సినిమాకి కూడా లభిస్తుం దని భావిస్తున్నాను’ అన్నారు మాటల రచయిత మల్లూరి వెం కట్. నిర్మాత మాట్లాడుతూ ‘ఒక మంచి చిత్రంతో నిర్మాతగా పరిచయమవడం సంతోషం. ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్. అచ్చ తెలుగు చిత్రంలా అలరిస్తుంది’ అని చెప్పా రు. అతిథిగా హాజరైన దర్శకుడు సముద్ర మాట్లాడుతూ ‘ట్రైలర్లో ఎనర్జీ లెవెల్స్ అద్భుతం. ఈ సినిమాతో విజయ్ సేతుపతికి తెలుగులోనూ స్టార్డమ్ రావాలని, సినిమా చక్కని విజయం సాధించాలని కోరుకుంటు న్నాను’ అన్నారు. మరో అతిథి నగేష్ నారదాసి మాట్లాడుతూ ‘కంటెంట్ నచ్చితే భాషతో సంబంధం లేకుం డా హిట్ లభిస్తుం దని ఖైదీ, విజిల్ చిత్రాలు రీసెంట్గా నిరూపించాయి. ఈ సినిమా కూడా ఆ వరుసలో చేరుతుం దని నమ్ముతున్నాను’ అన్నారు.