Spider Man Box Office: ‘స్పైడర్-మ్యాన్’ బాక్సాఫీస్ విధ్వంసం.. ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

Spider Man Box Office: ‘స్పైడర్-మ్యాన్’ బాక్సాఫీస్ విధ్వంసం.. ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

వరల్డ్ సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. ఇండియాలో జూలై 30న విడుదలైన ఈ చిత్రం, అమెరికాలో ఇవాళ జూలై 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. టామ్ హాలండ్ మరోసారి స్పైడర్-మ్యాన్‌గా నటించగా, డెస్టిన్ డానియల్ క్రెటన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. 

‘స్పైడర్-మ్యాన్’ బాక్సాఫీస్‌ సంచలనం..

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వచ్చిన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఇండియాలో విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. అమెరికాలో విడుదలకు ఒక రోజు ముందుగానే భారత్‌లో రిలీజైన ఈ చిత్రం, ఎలాంటి ప్రీవ్యూ షోలు లేదా బ్లాక్ బుకింగ్స్ లేకుండానే తొలి రోజు రూ.72.44 కోట్ల గ్రాస్, రూ.60.60 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. 

ఇండియాలో ఎలాంటి బ్లాక్ బుకింగ్స్, ప్రీవ్యూ షోలు లేకుండానే ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ చరిత్ర సృష్టించింది. తొలి రోజు రూ.60.60 కోట్ల నెట్ (రూ.72.44 కోట్ల గ్రాస్) వసూళ్లతో ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలోనే ‘స్పైడర్-మ్యాన్’ ఇండియా బాక్సాఫీస్ వద్ద హయ్యెస్ట్ ఓపెనింగ్ సాధించిన హాలీవుడ్ చిత్రంగా కొత్త రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా, షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ (రూ. 67 కోట్ల గ్రాస్), ‘కాంతార చాప్టర్ 1’ (రూ. 73 కోట్ల గ్రాస్) వంటి భారీ బడ్జెట్ ఇండియా చిత్రాల ఫస్ట్ డే రికార్డులను కూడా దాటేసింది. ఇక  ప్రస్తుతం పెద్ద పోటీ లేకపోవడంతో తొలి నాలుగు రోజుల్లో రూ.150–200 కోట్ల వసూళ్లు సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తొలి రోజు ఆక్యుపెన్సీ

సాక్‌నిల్క్ (Sacnilk) అంచనాల ప్రకారం, ఇంగ్లీష్ వెర్షన్ తొలి రోజు మొత్తం 56.58% ఆక్యుపెన్సీ నమోదు చేసింది. వర్కింగ్ డే అయినప్పటికీ, ప్రపంచవ్యాప్త విడుదలకు ముందే ఈ స్థాయి ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం.

ఉదయం షోలు – 51.22%
మధ్యాహ్నం షోలు – 51.22%
సాయంత్రం షోలు – 58.78%
రాత్రి షోలు – 65.11%

భాషల వారీగా ఫస్ట్ డే కలెక్షన్లు

సాక్‌నిల్క్ ప్రకారం:

ఇంగ్లీష్ – రూ.32.25 కోట్లు నెట్ (55% ఆక్యుపెన్సీ, 7,987 షోలు)
హిందీ – రూ.22 కోట్లు నెట్ (95% ఆక్యుపెన్సీ, 6,977 షోలు)
తెలుగు – రూ.3.25 కోట్లు నెట్ (65% ఆక్యుపెన్సీ, 995 షోలు)
తమిళం – రూ.3 కోట్లు నెట్ (66% ఆక్యుపెన్సీ, 1,168 షోలు)
మలయాళం – రూ.0.07 కోట్లు
కన్నడ – రూ.0.03 కోట్లు

మొత్తంగా, 17,250 షోలలో విడుదలైన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఇండియాలో తొలి రోజే రూ.60.60 కోట్ల నెట్, రూ.72.44 కోట్ల గ్రాస్ వసూళ్లతో హాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది.

కథేంటంటే:

‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ పీటర్ పార్కర్ (టామ్ హాలండ్) ఉనికినే ప్రపంచం మర్చిపోయిన తరుణంలో.. ఆ ఒంటరితనాన్ని జయిస్తూ సాగే కథతో ఈ సినిమా రూపొంచారు. 'నో వే హోమ్' క్లైమాక్స్ తర్వాత ప్రపంచమంతా పీటర్ పార్కర్‌ (టామ్ హాలాండ్) ని మర్చిపోతుంది. ఒంటరితనంతో బాధపడుతున్న పీటర్, తన శారీరక శక్తుల్లో కొన్ని వింత మార్పులు గమనిస్తాడు.

►ALSO READ | సాధ్వి సీత పాత్రకు సాయి పల్లవి కంటే ఈమెనే బెటర్ అని రచ్చ.. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరంటే..

మరోవైపు 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్' (DDC) పై అదృశ్య రూపంలో ఉన్న ఒక రహస్య టెలిపాత్ దాడి చేస్తుంది. అత్యంత ప్రమాదకరమైన 'V-MAX' అనే దాని కోసం ఈ దాడి జరుగుతుంది. ఇంతకీ ఆ దాడి చేసింది ఎవరు? ఆ దాడుల వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? జీన్ గ్రే' (సాడీ సింక్) కథేంటి? అతడు వెతుకుతున్న V-MAX అనే రహస్య శక్తి ఏమిటి?  ఈ గందరగోళం మధ్యలోకి హల్క్ (మార్క్ రుఫాలో), పనిషర్ (జాన్ బెర్న్‌థాల్), 'ది హ్యాండ్' ఎలా వచ్చారు? పీటర్ ఈ గ్లోబల్ ముప్పును ఎలా అడ్డుకున్నాడు అనేదే మిగతా కథ.