ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు: విజయ్ నాయర్‎కు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు: విజయ్ నాయర్‎కు బెయిల్

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆప్ కమ్యూనికేషన్స్ మాజీ ఇన్ చార్జి విజయ్ నాయర్‎కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు కావాలని ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ (ఈడీ) తరపు అడ్వొకేట్ చేసిన విజ్ఞప్తిని జస్టిస్ హృషికేశ్  రాయ్, జస్టిస్  ఎస్వీఎన్  భట్టి ధర్మాసనం కొట్టివేసింది. నిందితుడు నాయర్  రెండేళ్లుగా ఈ కేసులో కస్టడీలో ఉన్నాడని బెంచ్ పేర్కొంది. ఈ కేసులో కౌంటర్  వేయాలని గత నెల 12న ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాయర్  తరపున సీనియర్  అడ్వొకేట్లు అభిషేక్  మను సింఘ్వి, విక్రమ్  చౌధురి వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్  స్కామ్  కేసులో నాయర్​ను 2022 నవంబరు 13న అరెస్టు చేశారని, ఆయన బెయిల్ దరఖాస్తును ట్రయల్  కోర్టు కొట్టివేయగా సవాలు చేశారని గత నెల 12న వారు కోర్టుకు తెలిపారు.