టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల ప్రేమ వ్యవహారం గత కొన్నాళ్లుగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఏడాది దసరా తర్వాత హైదరాబాద్ లో వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే దీనిపై ఈ రొమాంటిక్ కపుల్ అధికారికంగా ప్రకటించకపోయినా.. వారి బంధువులు , సినీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఈ జంట చిన్న చిన్న హింట్స్ ఇస్తూ అభిమానులను ఉత్సహంలో ముంచెత్తుతున్నారు. వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఎంగేజ్‌మెంట్ తర్వాత తొలిసారి ఒకే వేదికపై..
నిశ్చితార్థం తర్వాత తొలి సారిగా రష్మిక, విజయ్ దేవరకొండ జంటగా అభిమానుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను అందుకున్న రష్మిక లేటెస్ట్ చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్' సక్సెస్ మీట్‌ను బుధవారం నిర్వహించనున్నారు మేకర్స్. ఈ వేడుకకు విజయ్ , రష్మిక కలిసి హాజరుకానున్నారు. ఎంగేజ్‌మెంట్ రూమర్‌ల తర్వాత ఈ జంట బహిరంగంగా ఒకే స్టేజీపై కనిపించబోతుండడం ఇదే మొదటిసారి. ఈవెంట్ వేదికపై వారిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటిస్తారా, లేదా పెళ్లి గురించి ఏమైనా హింట్ ఇస్తారా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
అందరికీ తెలుసు కదా అంటూ హింట్..
నిశ్చితార్థం తర్వాత రష్మిక మొదటిసారి మీడియా ముందుకొచ్చినప్పుడు, తన బాలీవుడ్ చిత్రం 'తమ్మ' ప్రమోషన్స్‌లో భాగంగా ఎంగేజ్‌మెంట్ గురించి ప్రశ్నించగా, ఆమె నవ్వుతూ "అందరికీ దాని గురించి తెలుసు కదా" అని చెప్పడం అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. దాదాపు అదే సమయంలో, ఒక వీడియోలో రష్మిక డైమండ్ రింగ్‌తో కనిపించగా, విజయ్ కూడా గుడి సందర్శన సమయంలో అలాంటి రింగ్‌తో కనిపించడం రూమర్‌లకు మరింత బలం చేకూర్చింది. అటు జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోలో పాల్గొని హింట్ ఇచ్చింది రష్మిక. అంతే కాదు మరో ఇంటర్యూలో కూడా విజయ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. దీంతో త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని అభిమానులకు క్లారిటీ వచ్చింది.
ఉదయ్‌పూర్ డెస్టినేషన్ వెడ్డింగ్?
వచ్చే ఏడాది ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా విజయ్, రష్మిక వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు కుటుంబాలు చురుకుగా వివాహ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. 'గీత గోవిందం' , 'డియర్ కామ్రేడ్' చిత్రాలలో తొలిసారి తెరను పంచుకున్న ఈ జంట, అప్పటి నుంచి రూమర్డ్ రిలేషన్‌షిప్‌తో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ జంట ఒక్కటి కాబోతున్నారు. ఈ జంట తమ వృత్తిపరమైన కమిట్‌మెంట్స్పూర్తి కాగానే, తమ అభిమానులకు ఈ గుడ్ న్యూస్‌ను అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సక్సెస్ మీట్ వేదికగా వారి ప్రేమ ప్రయాణంపై మరింత స్పష్టత వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
