
విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా పాండిరాజ్ తెరకెక్కించిన రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా ‘సార్ మేడమ్’.సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. ఇటీవల తమిళంలో విడుదలైన ఈ చిత్రం రేపు (ఆగస్టు 1న) తెలుగులో రిలీజ్ కాబోతోంది.
ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ మధ్యకాలంలో తాను చూసిన క్యూట్ అండ్ హార్ట్ టచింగ్ సినిమా ఇదని దర్శకురాలు నందినీ రెడ్డి బెస్ట్ విషెస్ చెప్పారు. హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ ‘అందరూ రిలీట్ చేసుకునే కథ ఇది. దర్శకుడు ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో చాలా బాగా తీశారు. ఈ సినిమా ఓ అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’అన్నాడు.
నిత్యామీనన్ మాట్లాడుతూ ‘విజయ్ గారితో ఇది రెండో సినిమా. గత చిత్రంలో సైలెన్స్ ఎక్కువ ఉంటే ఇందులో వైలెన్స్ ఎక్కువ. ఇది హీరోహీరోయిన్స్ సినిమా కాదు.. ఫ్యామిలీ సినిమా. తమిళంలో హిట్ అయినట్టే తెలుగులోనూ హిట్ అవుతుందని ఆశిస్తున్నా’అని చెప్పింది.
‘లవ్, కామెడీ, యాక్షన్, మాస్ ఎమోషన్స్ లాంటివన్నీ ఉన్న పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్’అని డైరెక్టర్ పాండిరాజ్ చెప్పారు. డిఓపి సుకుమార్, లిరిక్ రైటర్ రాంబాబు గోసాల, ఎన్‌విఆర్ సినిమాస్ సురేష్, నిర్మాత త్యాగరాజన్ పాల్గొన్నారు.