జనవరి నెలాఖరులో గాంధీ టాక్స్.. ఇండియ‌‌‌‌‌‌‌‌న్ సినిమాల్లో అరుదైన సైలెంట్ ఫిల్మ్‌

జనవరి నెలాఖరులో గాంధీ టాక్స్.. ఇండియ‌‌‌‌‌‌‌‌న్ సినిమాల్లో అరుదైన సైలెంట్ ఫిల్మ్‌

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ జాధవ్ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో కిషోర్ బెలేక‌‌‌‌‌‌‌‌ర్ దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రం ‘గాంధీ టాక్స్’. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇండియ‌‌‌‌‌‌‌‌న్ సినిమాల్లో అరుదైన సైలెంట్ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని జనవరి 30న విడుదల చేయనున్నట్టు శనివారం ప్రకటించారు. 

సినిమాను ఎంత గ్రాండియ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌గా,  ఎలాంటి సౌండ్‌‌‌‌‌‌‌‌తో రూపొందించారంటూ లెక్కలు వేసే నేటి రోజుల్లో ఈ సినిమా త‌‌‌‌‌‌‌‌న సందేశాన్ని శాంతియుతంగా, ఎలాంటి శ‌‌‌‌‌‌‌‌బ్దాలు లేకుండా, భావోద్వేగాల‌‌‌‌‌‌‌‌తో చెప్పబోతుందని మేకర్స్ తెలియజేశారు.  ఇందులో విజయ్ సేతుపతి, అర‌‌‌‌‌‌‌‌వింద్‌‌‌‌‌‌‌‌ స్వామి, అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ జాధవ్ తమదైన హావ‌‌‌‌‌‌‌‌భావాల‌‌‌‌‌‌‌‌తో, న‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌తో స్టోరీని చెప్పబోతున్నారని అన్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.