తమన్నా అంటే చచ్చేంత ప్రేమ : విజయ్ వర్మ

తమన్నా అంటే చచ్చేంత ప్రేమ : విజయ్ వర్మ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా(Thamannaah)తో వస్తున్న డేటింగ్ వార్తలపై ఎట్టకేలకు స్పందించాడు బాలీవుడ్‌ నటుడు విజయ్ వర్మ(Vijay varma). తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ వర్మ.. మిల్కీ బ్యూటీ తమన్నాతో తన ప్రేమాయణం గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తమన్నా, విజయ్ వర్మ కలిసి లస్ట్ స్టోరీస్ 2(Lust Stories2) మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇందులోభాగంగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్ వర్మ మాట్లాడుతూ.. "ప్రస్తుతం నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ప్రజలకు నా ప్రొఫెషనల్ కెరీర్‌కు సంబంధించిన విషయాలు మాత్రమే చెప్పాలనుకున్నా. సరైన సమయం వచ్చినప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి మీతో చెబుదామనుకున్నా. తమన్నా అంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పుకొచ్చాడు విజయ్ వర్మ. ప్రస్తుతం విజయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఇటీవలే విజయ్‌తో ప్రేమ విషయం గురించి ఓపెన్ అయ్యింది తమన్నా. విజయ్ అంటే తనకు చాల ఇష్టమని, లస్ట్ స్టోరీస్-2 సెట్స్‌లోనే లవ్‌లో పడినట్లు చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ.