ప్రతి నెలా పాల బిల్లు రూ.కోటి చెల్లింపు : విజయ డెయిరీ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి

ప్రతి నెలా పాల బిల్లు రూ.కోటి చెల్లింపు : విజయ డెయిరీ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి
  • విజయ డెయిరీ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి  

సదాశివనగర్, వెలుగు : ప్రతి నెలా కామారెడ్డి జిల్లాకు పాల బిల్లు రూ.కోటి చెల్లిస్తున్నామని విజయ డెయిరీ రాష్ట్ర చైర్మన్​ గుత్త అమిత్​రెడ్డి అన్నారు.  మంగళవారం హైదరాబాద్ లో విజయ డెయిరీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింత కుంట తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రైతులు అమిత్​రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అమిత్​ రెడ్డి మాట్లాడుతూ గతంలో పాల బిల్లులు ఆలస్యమయ్యేవని, సీఎం దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేశారన్నారు.  

పశువుల దాణా, గడ్డి జొన్నలను అందిస్తున్నామన్నారు. ఎర్రపహాడ్​ బీఎంసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, బీబీపేట్​ అధ్యక్షుడు సత్యంరెడ్డి, భిక్కనూర్​ అధ్యక్షుడు లోహిత్​ రెడ్డి, దోమకోండ అధ్యక్షుడు నరేశ్​ రెడ్డి, బ్రహ్మజివాడి అధ్యక్షుడు రాజేశ్వర్ రావు ఉన్నారు.