ఖుషి వీకెండ్ ట్రెండ్ ఒకే.. మరి ఫ్యూచర్ ట్రెండ్?

ఖుషి వీకెండ్ ట్రెండ్ ఒకే.. మరి ఫ్యూచర్ ట్రెండ్?

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఖుషి( Kushi) మొదటి వీకెండ్ని ఘనంగా ముగించింది. వరల్డ్ వైడ్ 70 కోట్లకు పైగా గ్రాస్ తో మంచి ఫిగర్స్ నమోదు చేయగా యూఎస్ లో 1.4 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే నైజామ్లో చాలా స్ట్రాంగ్గా ఉండగా.. సీడెడ్, ఆంధ్రలో అంత దూకుడు లేదు. అయినా ఆదివారం దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ బాగానే నమోదయ్యాయి. పోటీ లేని వాతావరణాన్ని ఖుషి బాగా వాడుకుంది.

హైదరాబాద్ కాకుండా మూవీ స్లోగా ఉన్న వైజాగ్ లో సక్సెస్ మీట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు మైత్రి మేకర్స్ అధినేతలు. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఖుషికి అసలు అగ్నిపరీక్ష ఈ రోజు నుంచి స్టార్టయింది. సాధారణంగా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే, మూవీకి వీక్ డేస్లో డ్రాప్ కచ్చితంగా ఉంటుంది. కాకపోతే అది మరీ తీవ్రంగా ఉంటే కష్టమే. బేబీ మూవీకి మండే కూడా సోల్డ్ అవుట్ బోర్డులు పడిన తెలిసిందే.

ఖుషికి యూనానిమస్ టాక్ వచ్చి ఉంటే ప్రొడ్యూసర్లు టెన్షన్ ఫ్రీగా ఉండేవారే. కాకపోతే మూవీపై జనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడం వల్ల కలెక్షన్స్ కొంత పిక్ అప్ అవ్వాల్సి ఉంటుంది. రేపు సాయంత్రానికి ఖుషి ఫ్యూచర్ ట్రెండ్ మీద ఒక స్పష్టమైన అవగాహన వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.