
విజయ్ దేవరకొండ స్పీడు మామూలుగా లేదు. ఒకదాని తర్వాత ఒకటిగా ప్రాజెక్టులు ఓకే చేస్తూనే ఉన్నాడు. క్రాంతిమాధవ్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ‘ఫైటర్’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదింకా సెట్స్‌కి వెళ్లకుండానే మరో మూవీకి కమిటయ్యాడు. ‘మజిలీ’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. బుధవారం దిల్ రాజు పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఆయనకి విషెస్ చెబుతూ ఈ సినిమాను ప్రకటించాడు విజయ్. దాంతో ‘వావ్.. విజయ్‌ది మామూలు స్పీడు కాదు’ అంటున్నారు నెటిజన్స్, ఫ్యాన్స్. ఆల్రెడీ నానీని ‘టక్ జగదీష్’గా మార్చే ప్రయత్నంలో ఉన్నాడు శివ నిర్వాణ. ఇప్పుడు విజయ్‌తో ఒక సినిమా ఓకే చేయించుకున్నాడు. అతడు తీసిన నిన్నుకోరి, మజిలీ సినిమాలు చూస్తే సున్నితమైన భావోద్వేగాలతో సినిమాలు తీస్తాడని అర్థమౌతుంది. మరి క్రేజీ హీరో విజయ్ కోసం ఎలాంటి కథ తయారు చేశాడో.