హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం సొంత ప్యాకేజీలా మార్చుకుందని ప్రభుత్వ విప్ విజయ రమణారావు ఆరోపించారు. గురువారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్లంపల్లి నీళ్లను కాళేశ్వరం నీళ్లుగా చూపించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ఉత్తర తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వొచ్చంటూ హరీశ్‌రావు చెబుతున్న మాటలు తప్పని ఫైర్అయ్యారు.
కేసీఆర్ పెద్ద ఇంజినీర్‌లా, హరీశ్ రావు చిన్న ఇంజినీర్‌లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మళ్లీ తానే సీఎం అవుతానని సీఎం రేవంత్ చెప్పడంతో కేటీఆర్ భయపడిపోయారని, అందుకే సర్వేల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 2035 వరకు రేవంత్‌రెడ్డే సీఎంగా ఉంటారని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
