- విప్ విజయరమణారావు
సుల్తానాబాద్, వెలుగు: క్రీడాకారుల్లో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడా పోటీలు అవసరమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌లోని కాలేజీ గ్రౌండ్‌లో అల్లాడి అరవిందరావు స్మారకార్థం సుల్తానాబాద్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో యువత, స్టూడెంట్స్ దురలవాట్లకు లోనుకాకుండా ఉండేందుకు ఇలాంటి టోర్నమెంట్స్ ఎంతో ఉపయోగపడతాయన్నారు.
కార్యక్రమంలో లైబ్రరీ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్‌పర్సన్ అంతటి పుష్పలత, కమిషనర్ టి. రమేశ్, అబ్బయ్య గౌడ్, నిర్వాహకులు సంజీవ్, క్రాంతి, అనిల్, సతీశ్, సిద్ద తిరుపతి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా సుల్తానాబాద్‌లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు చకిలం మారుతి, రామ్మూర్తి, కొమురవెల్లి భాస్కర్ పాల్గొన్నారు.

