
విజయ రామరాజు టైటిల్ రోల్‌లో నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ టీజర్‌ను డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. కబడ్డీ ప్లేయర్ నిజజీవితాన్ని ఆధారంగా తీసుకొని రూపొందిన ఈ మూవీ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విజయరామరాజు మాట్లాడుతూ ‘ఏడాదిన్నరపాటు ప్రో కబడ్డీ టీమ్స్‌తో ట్రావెల్ అయ్యి రియల్‌గా గేమ్ నేర్చుకుని ఈ సినిమా చేశా. నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా ఇది. ఇంత మంచి క్యారెక్టర్ ఉన్న సినిమా రావడం అదృష్టంగా భావిస్తున్నా’అని అన్నాడు.
హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు సిజ్జా రోజ్ థ్యాంక్స్ చెప్పింది. డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ ‘నా జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమాని ఆరేళ్ల పాటు 120 లొకేషన్స్‌లో షూట్ చేశాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో సినిమా ఉంటుంది’అని చెప్పాడు. అద్భుతమైన విజువల్స్, ఎమోషన్స్ ఉన్న కథ ఇదని అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని నిర్మాత శ్రీని గుబ్బల అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.