V6 News

భయంతోనే… కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన వాయిదా

భయంతోనే… కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన వాయిదా

సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ పర్యటన వాయిదా వేయడం వెనుక అసలు కారణం వేరే ఉందన్నారు  టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి.   హుజూర్ నగర్  ప్రచారానికి రోడ్డు వెంట వెళ్తే ఆర్టీసీ సమ్మె నిరసన సెగ తగులుతుందనే  భయంతోనే .. కేసీఆర్ హెలికాప్టర్ లో వెళ్లాలని అనుకున్నారని అన్నారు. అందుకే  వాతావరణం అనుకూలించలేదనే సాకుతో కేసీఆర్ టూర్ వాయిదా వేసుకున్నారని అన్నారు. మంత్రులను అడ్డుకున్నట్టే తనను కూడా అడ్డుకుంటారనే టెన్షన్ కేసీఆర్ కు మొదలైందన్నారు విజయశాంతి.