బీజేపీ కార్యకర్తలు కచరా పార్టీని తరిమేందుకు సిద్ధం కావాలి:విజయశాంతి

బీజేపీ కార్యకర్తలు కచరా పార్టీని తరిమేందుకు సిద్ధం కావాలి:విజయశాంతి

బీఆర్ఎస్ దొంగల పార్టీ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోచుకుందని ఆరోపించారు. బీజేపీ దేశాన్ని కాపాడే పార్టీ అని చెప్పారు. కూకట్ పల్లిలో బీజేపీ నాయకులు వడ్డే పల్లి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు హాజరయ్యారు. ఈ సందర్బంగా విజయశాంతి సమక్షంలో బీఆర్ఎస్,  కాంగ్రెస్కు  చెందిన  కార్యకర్తలు  భారీ ఎత్తున బీజేపీలో చేరారు.

తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యమని విజయశాంతి అన్నారు. బీజేపీ కార్యకర్తలు కచరా పార్టీని తరిమేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏర్పడిన నాటి నుంచి తెలంగాణను దోచుకోవడం తప్ప సీఎం కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమి లేదని మండిపడ్డారు.