హరీశ్ కు హుజురాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గుచేటు

V6 Velugu Posted on Oct 25, 2021

మంత్రి హరీశ్ రావుపై తీవ్రం గా ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేత విజయశాంతి. ఢిల్లీలో దళిత ఉద్యోగులను అత్యంత దారుణంగా బూతులు తిట్టి, వారిపై చేయి చేసుకుని అవమానించిన హరీశ్ కు హుజురాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గుచేటన్నారు. హరీశ్ రావు దళిత బంధు గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. దళితద్రోహి కేసీఆర్ కు, దళిత ద్వేషి హరీశ్ కు హుజురాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టవలసిన సందర్భం ఇది అని అన్నారు. అంతేకాదు.. హరీశ్ రావు ఎన్ని కథలు పడ్డా..కేటీఆర్ ని సీఎం ను చేసి.. ఆయన్ని పార్టీ నుండి బయటకు కేసీఆర్ వెళ్లగొట్టేది  భవిష్యత్తులో తప్పని పరిణామమన్నారు విజయశాంతి.

Tagged responsibility, vijayashanti, Shameful, Huzurabad elections, hand over, Harish

Latest Videos

Subscribe Now

More News