ఇండియన్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్‌కు షాక్ ఇచ్చాడు రష్యా యువ బాక్సర్. వరుసగా విజయాలతో దూసుకుపోతున్న విజేందర్‌కు అర్టిష్ లోప్సన్ బ్రేక్ వేశాడు. 12 బౌట్లలో తిరుగులేకుండా విజయాన్ని సాధించిన విజేందర్‌కు 13వ బౌట్‌లో ఓటమి పాలయ్యాడు. శుక్రవారం గోవాలోని సముద్ర తీరంలో మెజెస్టిక్ షిప్‌పై జరిగిన బాక్సింగ్ పోటీల్లో.. 8రౌండ్‌ల ఈ బౌట్‌లో భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ రష్యా యువ బాక్సర్ అర్టిష్ లోప్సన్ తలపడ్డారు. మొదటి నుంచి తన గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్న విజేందర్.. తొలి రౌండ్‌లో బాగానే ఆడాడు. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రౌండ్ మారుతున్నా కొద్ది లోప్సన్ ఆధిక్యం ప్రదర్శించాడు. పంచ్‌లు, హుక్‌లతో విజేందర్‌పై విరుచుకుపడ్డారు. దాంతో నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి విజేందర్ సింగ్ పూర్తిగా పట్టుకోల్పోయాడు. ఐదవ రౌండ్‌లో విజేందర్ పూర్తి డౌన్ అయ్యాడు. దాంతో రెఫరీ.. బాక్సర్ లోప్సన్‌ను విజేతగా ప్రకటించారు.
వరుస విజయాలతో దూకుడు మీదున్న విజేందర్‌ను ఐదు రౌండ్లకే నాకౌట్ చేసి.. అతని విజయాలకు బ్రేక్ వేశాడు లోప్సన్.

