జడ్పీ బిల్డింగ్ జల్దీ కట్టాలి.. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్

 జడ్పీ బిల్డింగ్ జల్దీ కట్టాలి..  వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్​, వెలుగు: జిల్లా పరిషత్ భవన నిర్మాణ పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్​ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం వికారాబాద్ జడ్పీ భవన నిర్మాణ పనులను అడిషనల్​ కలెక్టర్, జడ్పి సీఈవో సుధీర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  జడ్పీ ఆవరణలో ఆహ్లాదంగా కనిపించేలా మొక్కలు నాటాలన్నారు. పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉమేశ్​కుమార్ పాల్గొన్నారు.

23న ‘మీ డబ్బు మీ హక్కు’ క్యాంపు..

ఈ నెల 23న 'మీ డబ్బు మీ హక్కు' శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తులను ప్రజలు తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ మీటింగ్​ హాల్​లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంవత్సరాల తరబడి క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, డివిడెంట్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా పాలసీలు తదితర ఆస్తులను వాస్తవ యజమానులు సులువుగా పొందేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.