వికారాబాద్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ

వికారాబాద్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ

వికారాబాద్ పట్టణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఓ ఎమ్మెల్యేను స్థానికులు అడ్డుకున్నారు. అదేవిధంగా ఇబ్రహింపట్నం నుంచి కొందరు వచ్చి స్థానికంగా డబ్బులు పంచుతున్నారని రెండు పార్టీల మధ్య గొడవలు జరిగాయి. 

ఇరు వర్గాల మధ్య ఘర్షణలు పెడుతున్న ఓ వ్యక్తిని కాంగ్రెస్ నాయకులు పట్టుకొని.. పోలీసులకు అప్పగించారు.