వుడా ఏర్పాటుతో సమగ్రాభివృద్ధి

వుడా ఏర్పాటుతో సమగ్రాభివృద్ధి
  • అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్ 

వికారాబాద్, వెలుగు: వుడా ఏర్పాటుతో వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 493 గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్​లో పలువురు లబ్ధిదారులకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్స్​ను శుక్రవారం ఆయన అందజేశారు. తాము అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉద్యోగులకు జీతాలు ఇయ్యలేని పరిస్థితి ఉండేదని, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పరిస్థితిని దారిలోకి తెస్తున్నారన్నారు. వుడా తో మౌలిక వసతులకు నిధులు, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహం ఉంటుందని చెప్పారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.