ప్రతి గడప ముందు తెల్ల ఆవాలు..ఓట్ల కోసం పూజలు చేసి చల్లారని ఆరోపణలు

ప్రతి గడప ముందు తెల్ల ఆవాలు..ఓట్ల కోసం పూజలు చేసి చల్లారని ఆరోపణలు

పరిగి, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల వేళ ఓ గ్రామంలో ప్రతీ ఇంటి ముందు ఆవాలు కనిపించడం కలకలం రేపుతోంది. వికారాబాద్​ జిల్లా దోమ మండలం దొంగ ఎన్కేపల్లి గ్రామంలో సోమవారం  ఓటర్ల ఇంటి గుమ్మం వద్ద తెల్ల ఆవాలు కనిపించాయి. దీంతో ఊరంతా ఈ విషయం చర్చనీయాంశమైంది. ఆవాల వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ప్రచారం చేసిన వారు ఓట్ల కోసం  మంత్రించిన ఆవాలను చల్లుతున్నారనే ఆరపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలో కాంగ్రెస్​ బలపరిచిన అభ్యర్థి వనజ, బీఆర్​ఎస్​ బలపరిచిన అభ్యర్థి ప్రియారెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉంది. ఆవాలు చల్లడంపై వీరిద్దరు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. బీఆర్​ఎస్​ వర్గం పనేనని కాంగ్రెస్​ నాయకులు అంటుండగా, కాంగ్రెస్​ వాళ్లే చేశారని బీఆర్​ఎస్​ నాయకులు ఆరోపిస్తున్నారు.