సర్కార్ దవాఖాన డాక్టర్ తీరుపై రోగుల ఆందోళన

V6 Velugu Posted on Jan 24, 2022

వికారాబాద్ జిల్లా పరిగి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు పేషెంట్లు. వైద్య సిబ్బంది వ్యవహార శైలితో ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతుందన్నారు. అత్యవసర సేవల కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కి వస్తే డాక్టర్లు కనీసం పట్టించుకోవడంలేదన్నారు. తిమ్మాయిపల్లికి  చెందిన వెంకటేష్ తన కూతురుకి ఫిడ్స్ వచ్చిందని హాస్పిటల్ కు తీసుకొచ్చారు. అయితే డ్యూటీ డాక్టర్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ కు వస్తే గంట వరకు పట్టించుకోలేదని మరో బాధితుడు తెలిపాడు. ఫోన్ చూసుకుంటూ  పేషంట్లను పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

 

ఇవి కూడా చదవండి

 

 

Tagged Telangana, patients, Vikarabad, Treatment, trouble, Doctor, concern, government Hospital, parigi, Suffer, mobile phone

Latest Videos

Subscribe Now

More News