V6 News

ఫస్ట్ ఫేజ్ ప్రశాంతం.. వికారాబాద్ జిల్లా పంచాయతీ పోరు తొలిదశ వివరాలు ఇవే..!

ఫస్ట్ ఫేజ్ ప్రశాంతం.. వికారాబాద్ జిల్లా పంచాయతీ పోరు తొలిదశ వివరాలు ఇవే..!

వికారాబాద్/కొడంగల్, వెలుగు:వికారాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. తాండూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 81.21 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎన్నికల అధికారి షేక్ యాస్మిన్ భాష తదితరులు వెబ్‌‌ కాస్టింగ్ ద్వారా ఓటింగ్​సరళిని పర్యవేక్షించారు.

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లాలో మొదటి విడతలో 7 మండలాల్లో ఎన్నికలు జరగగా, సగటున 88.95 శాతం పోలింగ్​నమోదైంది. జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి పలుచోట్ల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మధ్యాహ్నం 1 గంట లోపు క్యూలో ఉన్నవారందరికీ ఓటు అవకాశం కల్పించాలని సిబ్బందికి సూచించారు.

కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు నిషేధం: ఎస్పీ

మూడు దశల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్  అమలులో ఉంటుందని వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. తొలి దశ ఫలితాలు వచ్చినా గెలిచిన అభ్యర్థులు, అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు, డీజేలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. 

మొదటి విడతలో కాంగ్రెస్​దే పై‘చేయి’

హైదరాబాద్​ సిటీ, వెలుగు: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలోని షాద్​నగర్​, శంషాబాద్​ నియోజకవర్గాల్లోని 174 స్థానాల్లో, అలాగే వికారాబాద్ ​జిల్లాలోని 262 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్​ బలపరిచిన 88 మంది, బీఆర్​ఎస్​ మద్దతు పలికిన 66, బీజేపీ నుంచి ఐదుగురు, ఇండిపెండెంట్లు 15 మంది విజయం సాధించారు. వికారాబాద్​ జిల్లాలో 262 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించగా, ఏకగ్రీవం కూడా కలుపుకొని కాంగ్రెస్​ మద్దతు తెలిపిన 177 మంది విజయం సాధించారు.

వికారాబాద్​ జిల్లాలో  మండలాల వారీగా పోలింగ్

  • పెద్దేముల్     82.64
  • యాలాల్     80.49
  • తాండూరు     77.70
  • బషీరాబాద్     77.45
  • బోంరాస్‌‌పేట    84.50  
  • దుద్యాల    84.34  
  • కొడంగల్    83.25  
  • దౌల్తాబాద్    81.82


రంగారెడ్డి జిల్లాలో  మండలాల వారీగా పోలింగ్

  • కొత్తూరు    91.27
  • కేషన్‌‌పేట్    89.90  
  • ఫరూక్‌‌నగర్    88.65
  • కొందుర్గ్    88.62  
  • నందిగామ    88.87 
  • జిల్లేడు చౌదర్‌‌గూడ    87.49  
  • శంషాబాద్    86.85


రంగారెడ్డి జిల్లాలో పార్టీల వారీగా ఫలితాలు

గ్రామాలు     కాంగ్రెస్    ​బీఆర్​ఎస్​    బీజేపీ     ఇతరులు 
174                     88              66              5                15

వికారాబాద్​ జిల్లాలో 

గ్రామాలు     కాంగ్రెస్    ​బీఆర్​ఎస్​    బీజేపీ     ఇతరులు 

262                   177               73             4                8