
- 40 శాతం మంది స్టూడెంట్లు ఫెయిల్
- మేడ్చల్ జిల్లా 14, రంగారెడ్డి 20, హైదరాబాద్ 28వ స్థానం
- కిందటేడుతో పోలిస్తే హైదరాబాద్, మేడ్చల్‌జిల్లాల్లో పెరిగిన పాస్ పర్సంటేజ్
హైదరాబాద్/రంగారెడ్డి/పరిగి, వెలుగు:
పదో తరగతి ఫలితాల్లో 59.46 పాస్పర్సంటేజ్తో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. 99 పాస్ పర్సంటేజ్‌తో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. వికారాబాద్ జిల్లాలో గతేడాది 90.42 శాతం మంది స్టూడెంట్లు పాస్ అవగా, ఈసారి 60 శాతానికి మించి కాలేకపోయారు. అలాగే 90.72శాతంతో మేడ్చల్-– మల్కాజిగిరి జిల్లా 14వ స్థానం, 87.25 శాతంతో రంగారెడ్డి జిల్లా 20వ స్థానం, 80.29 శాతంతో హైదరాబాద్జిల్లా 28వ స్థానాల్లో నిలిచాయి. రంగారెడ్డి జిల్లాలో గతేడాది 90.04 శాతం మంది స్టూడెంట్లు పాస్ అవగా, ఈసారి ఆ పర్సంటేజ్ తగ్గింది. హైదరాబాద్ జిల్లాలో 0.66 శాతం, మేడ్చల్-– మల్కాజిగిరి జిల్లాలో 4.41 శాతం పెరిగింది.
హైదరాబాద్ జిల్లాలో..
హైదరాబాద్జిల్లా వ్యాప్తంగా 98,468 మంది స్టూడెంట్లు టెన్త్ ఎగ్జామ్స్ రాశారు. ఇందులో 35,376 మంది అమ్మాయిలు, 33,092 మంది అబ్బాయిలు ఉన్నారు. మొత్తం 54,971 మంది పాస్అవగా, వీరిలో 29,638 మంది అమ్మాయిలు, 25,333 మంది అబ్బాయిలు ఉన్నారు. అలాగే జిల్లాలోని 9 గవర్నమెంట్ స్కూళ్లలో 100 శాతం పాస్ అయ్యారు. జిల్లాలోని గవర్నమెంట్, ప్రైవేట్‌స్కూళ్లలో కలిపి 577 మంది 10/10 జీపీఏ సాధించారు.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి జిల్లాలో మొత్తం 47,551 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్ రాశారు. వీరిలో 24,444 మంది అబ్బాయిలు, 23,107 మంది అమ్మాయిలు ఉన్నారు. మొత్తంగా 41,488 మంది పాస్‌అయ్యారు. వీరిలో అబ్బాయిలు 20,825, అమ్మాయిలు 20,663 మంది ఉన్నారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ, మోడల్, కేజీబీవీ, ఎయిడెడ్ స్కూళ్లలో చదివిన 47 మంది స్టూడెంట్లు, ప్రైవేట్‌స్కూళ్లలో చదివిన 927 మంది స్టూడెంట్లు 10/10 జీపీఏ సాధించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ జడ్పీహెచ్ఎస్ స్టూడెంట్ గోదల నిమ్మి 10/10 జీపీఏ సాధించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు స్వీట్లు తినిపించి అభినందించారు.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో..
మేడ్చల్మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 43,319 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్రాశారు. వీరిలో 22,224 మంది అబ్బాయిలు, 21,095 మంది అమ్మాయిలు ఉన్నారు. మొత్తంగా 39,299 మంది పాస్‌అయ్యారు. వీరిలో అబ్బాయిలు 19,802, అమ్మాయిలు 19,497 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,099 మంది స్టూడెంట్స్ 10/10 జీపీఏ సాధించారు.
వికారాబాద్ జిల్లాలో..
మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 13,399 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్రాశారు. వీరిలో 6,759 మంది అబ్బాయిలు, 6,640 మంది అమ్మాయిలు ఉన్నారు. మొత్తంగా 7,967 మంది మాత్రమే పాస్‌అయ్యారు. వీరిలో అబ్బాయిలు 3,643, అమ్మాయిలు 4,324 మంది ఉన్నారు. 32 మంది స్టూడెంట్లు 10/10 జీపీఏ సాధించారు. ఇంత దారుణమైన ఫలితాలు రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైమరీ స్కూళ్లలోని టీచర్లతో హైస్కూల్స్టూడెంట్లకు క్లాసులు చెప్పించడంతో పాస్పర్సంటేజ్దారుణంగా పడిపోయిందంటున్నారు. జిల్లాలో మొత్తం 305 హైస్కూళ్లు ఉండగా 95 స్కూళ్లకు పర్మినెంట్హెడ్మాస్టార్లు లేరు. 300 స్కూల్అసిస్టెంట్పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. సరిపడా టీచర్లు లేకనే 40 శాతం మంది పిల్లలు ఫెయిల్అయ్యారని వికారాబాద్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
అన్ని స్కూళ్లలో హెచ్ఎంలు లేకనే..
టెన్త్ ఫలితాల్లో చివరి స్థానంలో నిలవడానికి ప్రధాన కారణం జిల్లా మొత్తం గ్రామీణ ప్రాంతం కావడం. అన్ని ఊళ్లలో హైస్కూళ్లు అందుబాటులో లేవు. స్టూడెంట్లు ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లి చదువుకోవాల్సి రావడంతో ఆ ప్రభావం ఫలితాలపై పడింది. సరిపడా స్టాఫ్ లేక, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైమరీ స్కూళ్లలోని సిబ్బందితో క్లాసులు చెప్పించాం. స్కూళ్ల నిర్వహణ తీరు చూసుకునేందుకు అన్ని హైస్కూల్లో హెచ్ఎంలు లేరు. ఫలితాలపై ఈ సమస్య కూడా కొంత ప్రభావం చూపించింది.
– రేణుక, వికారాబాద్ డీఈఓ