వికారాబాద్, వెలుగు: బషీరాబాద్ పరిధిలోని మంతట్టి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ట్రాక్టర్లను సీజ్ చేసి బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు డ్రైవర్లతో పాటు ట్రాక్టర్ల యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
