V6 News

యాలాల్ మండలంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. యువకుడికి తీవ్ర గాయాలు

యాలాల్ మండలంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. యువకుడికి తీవ్ర గాయాలు

తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం లక్ష్మీనారాయణాపూర్​లో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం ఓ రైతు పొలం వద్ద రిపేర్ల కోసం అదే గ్రామానికి చెందిన మాల నరేశ్ ఎల్సీ (లైన్ క్లియరెన్స్) తీసుకుని స్తంభం ఎక్కాడు. పనిలో ఉండగానే ఒక్కసారిగా విద్యుత్ సరఫరా రావడంతో షాక్​కు గురై పక్కనే ఉన్న వరి పొలంలో పడిపోయాడు. 

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడి విషయం బయటకు రాకుండా తాండూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రహస్యంగా చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై లైన్ మెన్ వెంకటయ్యను వివరణ కోరగా నరేశ్ ఎల్సీ తీసుకోలేదని చెప్పారు. ఏఈ రఘువీర్ మాత్రం ఎల్సీ తీసుకున్నట్లు తెలిపారు. ఇలా అధికారుల సమాధానాల్లో పొంతన లేకపోవడం విద్యుత్ శాఖలోని సమన్వయ లోపాన్ని, బాధ్యతారాహిత్యాన్ని స్పష్టం చేస్తోంది.