- వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్
వికారాబాద్, వెలుగు: వికారాబాద్వెజిటేబుల్ మార్కెట్‌ను మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, వైస్ చైర్మన్ మల్లేషం గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్లో రూల్స్ అన్నీ కచ్చితంగా పాటించాలని కమీషన్ ఏజెంట్లకు వార్నింగ్ ఇచ్చారు.
ప్రభుత్వం ఫిక్స్ చేసిన కమీషన్ మాత్రమే తీసుకోవాలని, ప్రతి అమ్మకానికి రైతులకు కచ్చితంగా రసీదు (తడ్ పట్టి) ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే, ముట్టిలు, హమాలీ వ్యవస్థను పూర్తిగా తీసేస్తున్నామని తెలిపారు.
నిబంధనలు పాటించని వారి లైసెన్స్‌లను క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. రైతులు నష్టపోకుండా చూస్తామని, మార్కెట్లో త్వరలోనే మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని చైర్మన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఏజెంట్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ కిష్టారెడ్డి, మార్కెట్ కమిటీ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
