హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా వికాస్ రాజ్ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వికాస్ రాజ్‌ను రాష్ట్ర సీఈవోగా నియమిస్తూ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. అంతకుముందు సీఈవోగా ఉన్న శశాంక్ గోయల్ కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్‌పై వెళ్లారు. ప్రస్తుతం ఇన్‌చార్జి సీఈవోగా బుద్ధప్రకాశ్ విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు సీఈవోగా వికాస్‌రాజ్ బాధ్యతలు తీసుకున్నారు.
