చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి

చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి

న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు సీనియర్ దౌత్యవేత్త విక్రమ్ దొరైస్వామిని డ్రాగన్ కంట్రీకి మన రాయబారిగా కేంద్రం నియమించింది. 1992 బ్యాచ్‌‌  ఐఎఫ్ఎస్ అధికారి దొరైస్వామి, ప్రస్తుతం యూకేలో భారత హైకమిషనర్‌‌గా పనిచేస్తున్నారు. తూర్పు లడఖ్‌‌లో కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనకు తోడు 2020లో గల్వాన్ లోయ ఘర్షణతో ఇరు దేశాల మద్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతలను తగ్గించుకుని దౌత్యపరమైన సంబంధాలను పునరుద్ధరించుకోవాలని భారత్, చైనా భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే దొరైస్వామిని నియమించినట్లు సమాచారం.