ఓటీటీలో విక్రమ్.. డేట్ ఫిక్స్

ఓటీటీలో విక్రమ్.. డేట్ ఫిక్స్

కరోనా సమయంలో ప్రేక్షకులకు ఓటీటీ (OTT) ప్లాట్ ఫామ్స్ దగ్గరయ్యాయి. కామెడీ, థ్రిల్లర్, ఇతర సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో వివిధ ప్లాట్ ఫామ్స్ ద్వారా రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. కొద్ది రోజుల అనంతరం మూవీస్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఓటీటీ కళకళలాడుతోంది. ఇందులో చిన్న సినిమాల నుంచి మొదలైన భారీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’(RRR), ‘ఆచార్య’ (Acharya)తో పాటు ఇతర సినిమాలు ఓటీటీలో ప్రేక్షకులను అలరించాయి. తాజాగా.. విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ (Vikram) సినిమా కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా జూన్ 03న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. లోకేష్ కనరాజ్ దర్శకత్వంలో ‘కమల్’ నటించిన ‘విక్రమ్’ సినిమా ఘన విజయం సాధించింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాతో కమల్ హాసన్ ఫుల్ ఫామ్ లోకి వచ్చారు.

తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా విదేశాల్లో సైతం ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీని త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. జూలై 08వ తేదీన ‘విక్రమ్’ మూవీని రిలీజ్ కు ప్లాన్ చేయడం జరిగిందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney+ Hotstar)వెల్లడించింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ ద్వారా పోస్టు చేసింది. అధికారికంగా ఓ వీడియోను విడుదల చేశారు. మనకు నచ్చని సినిమాను ఎన్నిసార్లు చూసిన చాల్లేదు కదా.. పదండి చూద్దాం.. అంటూ విక్రమ్ స్టైల్ లో గన్ చూపిస్తూ.. ఆ వీడియోలో కమల్ డైలాగ్ చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో విక్రమ్ అందుబాటులోకి రానుంది. దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ‘విక్రమ్’ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఘన విజయం సాధించడం పట్ల కమల్ బహుమతులను అందచేశారు. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కు కారును గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి తెలిసిందే.