విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.
‘అనకాపల్లి.. ఇక్కడ మనకు కావాల్సింది దక్కాలంటే.. ఎదుటోడికి మనమంటే భయం ఉండాలి.. భయం లేనోడికి పిడికిలి రుచి చూపించాలి.. మనకి కావాల్సింది దక్కించుకోవాలి..’ అనే డైలాగ్‌తో మొదలైన టీజర్ ఆకట్టుకుంది. యూత్ మెచ్చే లవ్ ట్రాక్, మాస్‌కి నచ్చే యాక్షన్ సీక్వెన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సీన్స్‌తో అన్ని రకాల ఎమోషన్స్‌ను ఇందులో చూపించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఉదయ్ భాగవతులు డైలాగ్స్ రాయగా, దేవ్ జండ్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్‌లో సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు.
