
తెలంగాణ విజిలెన్స్ కొత్త డీజీగా విక్రమ్ సింగ్ మాన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు నెలాఖరులో కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి రిటైర్ కానుండటంతో ఆయన స్థానంలో విక్రమ్ సింగ్ మాన్ బాద్యతలు స్వీకరించనున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ నగర అదనపు కమిషనర్ గా పనిచేస్తున్న విక్రమ్ సింగ్ మాన్ ఇక నుంచి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కు డీజీగా ఉండనున్నారు.