
విక్రమ్ ఎప్పుడూ రెండు విషయాలతో ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తుంటాడు. అద్భుతమైన నటన.. డిఫరెంట్ లుక్. ప్రతి సినిమాకీ మేకోవర్ అయిపోతాడు. కొత్త గెటప్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేస్తాడు. అయితే ఇంతవరకు చేసింది ఒకెత్తు. అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్‌లో లలిత్ కుమార్ నిర్మించిన ‘కోబ్రా’లో చేసింది మరొకెత్తు. ఎందుకంటే ఇందులో ఏకంగా ఇరవై అయిదు గెటప్స్‌లో కనిపించ నున్నాడు విక్రమ్. వీటిలో కొన్ని గెటప్స్‌తో పిక్చరైజ్ చేసిన ‘అధీర’ అనే పాటను తాజాగా విడుదల చేశారు. రెహమాన్ ట్యూన్ చేసిన ఈ పాట చాలా జోష్‌ఫుల్‌గా ఉంది. అందులో విక్రమ్ క్యారెక్టర్‌లోని వేరియేషన్స్ చూస్తుంటే వారేవా అనిపిస్తోంది. తన ఇంటెలిజెన్స్‌తో పోలీసులకు చుక్కలు చూపించే ఖతర్నాక్ మ్యాథమెటీషియన్ పాత్ర విక్రమ్‌ది. అందుకే రకరకాల వేషాలు మార్చి కాప్స్‌ని బోల్తా కొట్టిస్తున్నాడు. ఒకే సినిమాలో ఇన్ని రకాలుగా కనిపించడం చిన్న విషయం కాదు. దాని కోసం విక్రమ్ ఎంతో కష్టపడ్డాడని, ప్రేక్షకులకు థియేటర్‌లో సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ దొరుకుతుందని మేకర్స్ అంటున్నారు. పాటే ఇంత మెస్మరైజ్ చేసిందంటే మూవీ కచ్చితంగా అలాగే ఉండే చాన్స్ ఉందనిపిస్తోంది. వరుస పరాజయాలతో ఉన్న విక్రమ్‌కి ఈ మూవీ సక్సెస్ కీలకం కూడా. ‘కేజీయఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా కీలక పాత్ర పోషించడం విశేషం.