నవంబర్ 17న స్పార్క్ సినిమా విడుదల

నవంబర్ 17న స్పార్క్ సినిమా విడుదల

విక్రాంత్‌‌‌‌‌‌‌‌‌‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’.  మెహ్రీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్స్‌‌‌‌. నవంబర్ 17న సినిమా విడుదల కానుంది. శనివారం ట్రైలర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. విక్రాంత్ మాట్లాడుతూ ‘ఈ సినిమా నా మూడేళ్ల కల. ఇదొక మ‌‌‌‌ల్టీ జాన‌‌‌‌ర్ మూవీ. యాక్షన్‌‌‌‌తో పాటు కామెడీ, థ్రిల్లర్, ల‌‌‌‌వ్ స్టోరీ కూడా ఉంటుంది.

యూనివ‌‌‌‌ర్సల్ అప్పీల్ ఉండటంతో  పాన్ ఇండియా రేంజ్‌‌‌‌లో  రిలీజ్ చేస్తున్నాం. లేఖ పాత్రలో మెహ్రీన్ ఆకట్టుకుంటుంది. రుక్సార్ థిల్లాన్, గురు సోమసుందరం, సుహాసిని, నాజర్ కీలక పాత్రలు పోషించారు. బ్రహ్మానందం, వెన్నెల  కిశోర్, సత్య తమదైన కామెడీతో నవ్విస్తారు. హేషం అబ్దుల్ వ‌‌‌‌హాబ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది’ అని చెప్పాడు.  

టైటిల్‌‌‌‌కు తగ్గట్టే సినిమా స్పార్క్‌‌‌‌లా ఉంటుందని చెప్పింది మెహ్రీన్.  నటుడు గురు సోమసుందరం, మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ పాల్గొన్నారు.