తెలంగాణలో గ్రామ స్థాయిలో రెవిన్యూ వ్యవస్థను ప్రవేశ పెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేస్తున్న ఈ కొత్త రెవిన్యూ చట్టంలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు, రైతులకు మంచి జరుగుతుందన్నారు. త్వరలో రెవిన్యూ అధికారులకు ప్రమోషన్స్ ఉంటాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెవిన్యే వ్యవస్థను చులకన చేసిందంటూ.. గ్రామ రెవిన్యూ అధికారులను నియమిస్తామన్నారు. ప్రస్తుతం గ్రామ స్థాయిలో రెవెన్యూ లో గ్రామ స్థాయిలో విఆర్ఏ లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఈవ్యవస్థ బాగుపడాలంటే అందరం చిత్తశుద్దితో పని చేయాలన్నారు. ప్రభుత్వం లో తనను రు నెంబర్1 నెంబర్ 2 అంటున్నారని .. నెంబర్లు ముఖ్యం కాదు పరిపాలన ముఖ్యమన్నారు. రెవిన్యూ మంత్రిగా రైతుల అభివృద్ది కోసం కోట్లాడతానన్నారు.
