V6 News

రోడ్లు బాగుపడితేనే గ్రామాల అభివృద్ధి: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

రోడ్లు బాగుపడితేనే గ్రామాల అభివృద్ధి: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ముదిగొండ, వెలుగు: గ్రామాల అభిభివృద్ధి మెరుగైన రహదారులతోనే సాధ్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లిలో రూ.9 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు సదుపాయాలు మెరుగుపడితే రవాణా సౌకర్యాలు సులభమవడంతో పాటు గ్రామాల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతాయన్నారు. ప్రభుత్వం గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.