మాజీ ఎమ్మెల్యే రసమయి.. మా ఉసురు తగిలి నాశనం అవుతావు

మాజీ ఎమ్మెల్యే రసమయి.. మా ఉసురు తగిలి నాశనం అవుతావు

తమను మానసికంగా వేధించి, బిల్లులు రాకుండా అడ్డుకొని ఆర్థికంగా నష్టం చేసిన నువ్వు ఊరికే ఉండవు.. మా ఉసురు తగిలి నాశనం అవుతావని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను దుమ్మెత్తిపోస్తున్నారు గ్రామ సర్పంచ్ లు. తమ ఆవేదనను ఎలా తీరుతుంది.. ఎవరికి చెబితే పరిష్కారం అవుతుందో తెలియక.. ఆయన మీదున్న కోపాన్నంత ఇలా చేశాడు ఓ సర్పంచ్. అదేంటో ఇప్పుడు చూద్దాం..

గత నాలుగున్నర సంవత్సరాలుగా తమను మానసికంగా వేధించి, బిల్లులు రాకుండా అడ్డుకొని.. తమను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆర్థికంగా నష్టం చేశాడని కరీంనగర్ జిల్లా గునుకుల కొండాపూర్ గ్రామ సర్పంచ్ లింగంపల్లి జ్యోతి భర్త బాలరాజు ఓ వీడియో రూపంలో వెల్లడించాడు. ఎమ్మెల్యే రసమయి వారికి చేసిన ఇబ్బందులను, ఆర్థికంగా నష్టపోయిన వివరాలను తెలియజేశాడు.
 
తమకు 30 గుంటల భూమిని అమ్ముకుని కరీంనగర్ కు వెళ్లి, బట్టలు ఉతుక్కొని బతికే విధంగా చేసిన నీకు.. మా ఉసురు తప్పక తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే రసమయి నువ్వు  ముందు ముందు మరింత అనుభవిస్తావని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం ఆ వీడియోను తన గ్రామంలోని సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియోలో చెక్కర్లు కొడుతుంది. 

ఆదివారం(జనవరి 28) ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించి.. కాంగ్రెస్ నాయకులు హద్దు మీరు మాట్లాడకూడదని హెచ్చరించిన తరుణంలో సర్పంచ్ లింగంపల్లి జ్యోతి భర్త బాలరాజు ఈ వీడియో  గ్రూపుల్లో షేర్  చేశాడు.