కరోనా సోకినా.. ప్రాపర్టీ సర్వే చేస్తున్న విలేజ్ సెక్రటరీ

కరోనా సోకినా.. ప్రాపర్టీ సర్వే చేస్తున్న విలేజ్ సెక్రటరీ

ఆఫీసర్లు ఆదేశించారంటున్న పంచాయతీ సెక్రటరీ

నవాబుపేట, వెలుగు: పంచాయతీ సెక్రటరీకి కరోనా సోకినప్పటికీ హోమ్​ఐసోలేషన్​లో ఉండకుండా ప్రాపర్టీ సర్వే చేస్తున్న ఘటన మహబూబ్​నగర్​ జిల్లా నవాబుపేట మండలంలో మంగళవారం వెలుగుచూసింది. యన్మన్​గండ్ల పంచాయతీ సెక్రటరీకి గత నెలలో కరోనా సోకింది. క్వారంటైన్లోకి వెళ్లిన ఆయన 17 రోజుల తర్వాత  పరీక్షలు చేయించుకోగా మళ్లీ పాజిటివ్​ వచ్చింది. విషయాన్ని అధికారులకు తెలియజేసినా సర్వేకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని ఆదేశించారని సెక్రటరీ పేర్కొంటున్నారు. మంగళవారం గ్రామంలో తిరుగుతూ జనాలతో కలుస్తూ సర్వే నిర్వహించడంతో అంతా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్​ వచ్చినప్పటికీ బయట ఎందుకు తిరుగుతున్నావని ప్రజలు ప్రశ్నించగా విషయం చెప్పినప్పటికీ ఉన్నతాధికారులే సర్వే చేయాలని ఆదేశించారని సెక్రటరీ వారికి సమాధానమిచ్చారు.

For More News..

ఖమ్మం అత్యాచార బాధితురాలికి 18 రోజులు రహస్యంగా ట్రీట్మెంట్​

దుబ్బాకలో రసవత్తరం.. వంద ఓటర్లకో ఇన్​చార్జి..

ఆన్​లైన్‌లోనూ అమ్మాయిలపై వేధింపులు