
యాదాద్రి భువనగిరి జిల్లా: మూఢ విశ్వాసంతో ఓ వ్యక్తిని గ్రామస్థులు దాడి చేసిన సంఘటన మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. రాజపేట మండలం, దూది వెంకటాపురం గ్రామానికి చెందిన ఎల్లయ్య అనే వ్యక్తి బాణామతి చేస్తున్నాడనే నెపంతో గ్రామస్థులు అతడిపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు .. తీవ్ర గాయాలైన ఎల్లయ్యను హాస్పిటల్ కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు పోలీసులు. ఈ సంఘటనపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.