ఆలయ భూమి కబ్జాపై గ్రామస్తుల ఆందోళన

ఆలయ భూమి కబ్జాపై గ్రామస్తుల ఆందోళన

వెల్దుర్తి, వెలుగు: మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గ్రామ దేవతల స్థలాన్ని కబ్జా చేసి మరొకరికి అమ్మి సొమ్ము చేసుకున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. శనివారం గ్రామానికి చెందిన కుస్తీ బాలకిషన్, గోవిందరెడ్డి, కుష్టి గణేశ్, చాకలి సత్తయ్య, బాలేశ్ , తొంట నరసింహులు మాట్లాడుతూ ఆరేగూడెం గ్రామంలో  గడి మైసమ్మ ఆలయం ఉండేదని, గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆలయాన్ని తొలగించి దేవతా మూర్తుల విగ్రహాలను మరోచోట ప్రతిష్ఠించి 150 గజాల స్థలాన్ని ఆక్రమించుకొని మరో వ్యక్తికి అమ్మాడని ఆరోపించారు. 

ఆ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి అక్కడ ఇంటి నిర్మాణం చేపట్టడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. గుడిని తొలగించి గుడి స్థలంలో నిర్మాణాలు చేపడితే ఊరికి అరిష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  గ్రామస్తులు తొలగించిన దేవత మూర్తులను తిరిగి ఆలయ స్థలంలో ప్రతిష్ఠించారు.