అశ్వారావుపేటలో రోడ్డు రిపేర్లు చేపట్టాలని గ్రామస్తులు ఆందోళన

అశ్వారావుపేటలో రోడ్డు రిపేర్లు చేపట్టాలని గ్రామస్తులు ఆందోళన

అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు రెండేండ్లైనా పూర్తి కాకపోవడంతో బుధవారం స్థానికులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. రోడ్డుపై డ్రమ్ములను పెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్డు కారణంగా దుమ్ముధూళితో నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆర్ అండ్ బీ డీఈ ప్రకాశ్​కు ఫోన్ చేసి మాట్లాడారు. రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఖమ్మం, రాజమండ్రి ప్రధాన రహదారి కావడంతో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి.