సీతామాతకు  గిరిజనుల పూజలు 

సీతామాతకు  గిరిజనుల పూజలు 

వికారాబాద్, వెలుగు : వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని గిరిజనుల ఆరాధ్యదైవం సీతామాతకు కోటాలగూడ గ్రామస్తులు శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏడాది జూన్ లో శుక్రవారం పూడూరు మండలం  గొంగుపల్లిలోని సీతామాతకు వికారాబాద్ మండలం కోటాలగూడ గిరిజనులు ప్రత్యేక పూజలు చేస్తుం డడం ఆనవాయితీగా వస్తోంది.

కోటాలగూడ గిరిజనులు పూజలు చేసిన రోజున వాన దేవుడు కరుణించి వర్షం పడుతుందని నమ్ముతామని గ్రామస్తులు చెప్పారు. సీతామాత కటాక్షాలతో రైతులు వేసిన పంటలు బాగా పండి ధాన్య, సిరులతో తులతూగలని దేవుణ్ణి ప్రార్థించారు. ఈ పూజలో కోటాలగూడ గిరిజనులు 500 మంది పాల్గొన్నారు.