వర్షాల కోసంపాల పొంగళ్లు

వర్షాల కోసంపాల పొంగళ్లు

వర్షాలు కురవాలని ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామ శివారులోని హేమాచల క్షేత్రం పై లక్ష్మీ నృరసింహస్వామి సన్నిధిలో మల్లూరు గ్రామస్తులు పాలు పొంగించారు. యేటా ఆషాడ మాసంలో సకాలంలో వర్షాలు రావాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు పండాలని పాలు పొంగిస్తామని తెలిపారు. అనంతరం స్వామి కి నైవేద్యం అందించారు. కార్యక్రమంలో ఎర్రంగారి నారాయణ , ఎర్రంగారి సురేశ్​, దిడ్డి పురుషోత్తం, సాయిని సమ్మయ్య, ఆదినారాయణ, రాములు, ఆల్ల శ్రీనివాసు గ్రామస్తులు పాల్గొన్నారు. 

- మంగపేట, వెలుగు